Wednesday, March 18, 2009

ఎక్కడో..


వెంకటేష్

ఎక్కడో
మూలమలపున
రెండు చేతులు
దీనంగా కిందికి పైకి
ఊగుతున్నాయి!

చింపిరి మొహం
తైల సంస్కారం లేని
జుత్తు ఒళ్ళంతా కమురు వాసన

కడుపు వెన్నుకు
ఆనుకు పొయింది
ఆ కనులు వికృత
సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి!

Tuesday, March 17, 2009

అన్వేషణ


--వెంకటేష్
ఎక్కడని వెతకను
ఉన్నావన్నా ఆశతో
నిరంతరం డేగ చూపులతో
అణువణువు గాలిస్తూ...

రహదారిపై ఎర్రటి ఎండలో
ఏడో నంబరు మైలురాయిపై
ఎవరో కూర్చొన్నారు...
శరీరాన్ని ముద్దలా మడిసి
గుండ్రంగా సున్నాల కనిపిస్తున్నారు!

అర్దనిమీలిత నేత్రాలతో
ఆత్రంగా వెతుకులాట
అక్కడో,ఇక్కడో,మరెక్కడో
నిను వెతుకుంటున్నాను!

సూదూర తీరాన్నుంచి
నీ గద్గద స్వరం
మలయమారుతంలా తాకింది
నా మనోహర నేత్రం విచ్చుకుంది సంతోషంగా!

రెండు రక్తపు బొట్లు
నేలపై రాల్చి
పెను వృక్షమై ఎదిగినా...
నాపై వాలే పావురాలు
కూడ నీ జాడ చెప్పలేదు!

కన్నీటి తెరలలో
నీ అస్పస్ట రూపం
కనులు మూసి తెరిచేలోగా
మాయమై పోతున్నది!

చిక్కటి చీకటిలో కూడ
ఎక్కడివో వెలుతురు జాడలు
మనస్సులోకి దూరి దైర్యానిస్తున్నాయి!

కనిపించక పోవడం తత్కాలికమే
కనుమరుగవడమే భరించలేనిది!

Saturday, March 14, 2009

I try to wipe you out the memory banks of my mind, as if you don’t even exist; but as much as I attempt to do so I fail.Memories of you are ever where.Half of me dislike you for putting through so much hell.The other half can’t tolerate to be alone and I rather have you to return home.I am not going to deny that my feelings for you are still alive…and your absence has made them stronger than ever.When are you going to realize that we belong together?It has been extremely difficult to go to asleep at night without having you by my side.I am man enough to admit that I am going through withdraw symptoms. I am miserable …this is the reason why I cry.I know that some where in your heart you feel the same for me.Just look a little deeper… past the anger, hurts and sorrows and then you will see that you still do love me.

Thursday, March 12, 2009

తెలుగు కథల్లో "చైతన్యస్రవంతి"

తెలుగు కథల్లో "చైతన్యస్రవంతి"


తెలుగు కాల్పనిక సాహిత్యంలో చైతన్యస్రవంతి శిల్పానికి ఆద్యుడు జేంస్ జాయిస్.1922 లో వెలువడిన ఈయన నవల "యులిసెస్"చైతన్యస్రవంతిలో సాగినా,నిజానికి ఇది పైరో టెక్నిక్ నవల.మొదటి ప్రపంచయుద్దం తర్వాత యూరోపియన్ సమాజంలో తలెత్తుతున్న మార్పులు విడిపోతున్న కుంటుంబ బందాలు,మానవ సంబందాలు ఆర్థిక సంబందాలుగా మారిపోతున్న సంధికాలంలో ఆత్మీయ స్పర్శ కోసం మనిషి పడే తపన మొదలైన వాటిని హోమర్ గానం చేసిన గ్రీకు మైథాలజి "ఒడిస్సి"లోని పురాణ పాత్రలను స్ప్రురింపజేసేలా సమకాలీన వ్యక్తుల జీవితాన్ని,వారి జివిత పరమర్థాన్ని అద్బుతమైన భాషా విన్యాసంతో చిత్రించిన ఆదునిక మానవేతిహాసం "యులిసెస్",

Monday, March 9, 2009

శ్రమ సంబందాలు నశించి ఆర్థిక మానవసంబందాలు పెద్దపీట వేయడం మీద కవి ఆవేదన వ్యక్తం అవుతుంది.రుతువులకు,రైతులకు ఉన్న సంబందం విడదీయరానిది.
"ఇకపై కృషివలుని చుట్టూకందకాల్లా కొత్తవలయాలుకాడికి కంప్యూటర్ మేడికి "కీ" బోర్డు వెబ్ సైట్ లో విత్తడం ఇంటర్నెట్ లో అమ్మకం అంతా గ్లోబలైజేషన్ సాగుభూముల్లో తొండల గుడ్లు"
'దగాపడ్డ చెమటచుక్క దిగాలుగ చూస్తుందీ అంటూ మొదలయ్యే 'దుక్కిచూపూకావ్యం పాఠకుడిని తనవెంట లాక్కుపోతుంది.'నిజంగా పేదరికం ఓ నిశ్శబ్దపు గాయం'అన్న పూర్తి అవగాహన కలిగిన రచయిత వెంకటేశ్వరరెడ్డి.
"ఈ రోజు మాట్లాడు కోవడానికిపేదరికమంతావిలువైన వస్తువు మరొకటిలేదు" అని దెప్పి పొడిచాడు.కవి వస్తువును ఎన్నుకోవడంతో పాటు వస్తువుకు తగిన రూపాన్ని,అభివ్యక్తిని తగిన విదంగా వాడుకొన్నాడు.రైతు భాధలను కవిత్వీకరించడంలో అనేక భావ చిత్రాలను ఎన్నుకొని వర్తమాన వ్యవసాయం ఎలా తయారయిందో చిత్రీకరించాడు.
"క్షణం క్షణం శిలువనెక్కే సేద్యం కారంతా కరువు ఏకరువు పెట్టుకోను దిక్కులేదు"
దేశానికే రైతు వెన్నుముక అని గొప్పలు చెప్పుకొనే రాజకీయ వ్యవస్థలో వ్యవసాయరంగం నగ్నస్వరూపాన్ని వెల్లడిస్తున్నాడు.
"అసలు పంట పొలాలకుపాడె గట్టిన ప్రతిభ ఎవరిది?
కరువు రైతులు రైతు కూలీలు అప్పుల ఊబిలో కూరుకపోయి ఆత్మహత్యలు చేసుకొనే పరిణామం దాపురించింది.
"అప్పును ఆత్మహత్యను బొమ్మగా గీస్తే పత్తి రైతు గోచరిస్తాడు ఇపుడు రైతును మోసగించనిది మరణమొక్కటే"
భారతీయ రైతుకు ప్రపంచీకరణ పరమ శత్రువు.కవి ఈ సత్యాన్ని గ్రహించాడు."సైబర్ సైతాంతో రక్కించాక సంస్కరణలన్ని శాడిజం సింబల్ కాబోతున్నాయ్నేలంతా గాయాలు అల్లుకున్నప్పుడు ఆయుధం ఓ తిరుగుబాటై చిగుర్చుతుంది"
అని ఈ రైతు కావ్యంలో కవి ఇస్తున్న సందేశం."దుక్కిచూపు" ఆకలి కావ్యం.రైతు ఆగ్రహ కావ్యం.రైతు గాయాన్ని పాడుతున్న కర్షక కవి "కొండ్రెడ్డి"మరిన్ని కావ్యాలు రాయాలని కోరుకుంటున్నాను.

Saturday, March 7, 2009

శ్రామిక కవిత్వం-సమకాలీన స్పందన
శ్రామిక కవిత్వం-సమకాలీన స్పందన ప్రపంచీకరణ పాలకవర్గాలకు తప్పనిసరి అవసరం.దీని ప్రభావం మాత్రం ప్రజల ప్రాణాల మీదికి వస్తుంది.ఈ నేపద్యమే ఈనాటి కవిత్వానికంతటికి కారణం.అనుభూతి,ఆవేశం కవిత్వానికి ప్రధాన ద్రవ్యాలని మహాకవి జాషువా అంటాడు.ఈ రెండు "కొండ్రెడ్డి"లో పుష్కలంగా ఉన్నాయి.సమకాలిన పతనానికి సంబందించిన సర్వ అంశాలూ,ఎంతో అవేశంతో,కోపంతో ఖండిస్తూ పోతాడు కవి. ఈ రచయిత ఇటివల వెలువరించిన "దుక్కిచూపు"లొ ఈ అంశాలన్ని రాసులు పోసినట్లుగా కనిపిస్తాయి."దుక్కిచూపు" అనగానే దున్నిన మట్టిచూపు అనుకోవడం సహజం.ఆ నైజం భాహిరం మాత్రమే.కాని కాస్త లోతుగ చూస్తే ఆ దుక్కికి అడుగున ఆర్తి ఉంది.మనిషికి మనుగడ కలిగించే జీవస్పూర్తి ఉంది.రచయిత తీసుకొన్న వస్తువు ప్రాథమికంగా పల్లెపరిసరాలకు సంభంధించిందే.వ్యవసాయం అంటే ఏమిటో,ఎంత కవితాత్మకంగా చెప్పాడొ ఈ క్రింది పంక్తులు సాక్షాలుగా నిలుస్తాయి. "వ్యవసాయం అంటే..../వేగుచుక్కతో మొలిచొచ్చే కళ్ళు/కోడికూతతో కదిలే కాళ్ళు/పొడిచే పొద్దుతో/దినచర్యలైపొయిన చేతులు" ఇలా కొత్తదనాన్ని కుమ్మరించే పంక్తులెన్నో ఈ కావ్యంలో ఉన్నాయి."దుక్కిచూపు" రైతు కావ్యం. ఇక్కడి ప్రజల అనుమతి లేకుండా బలవంతంగా ప్రజల నెత్తిన గ్లోబలైజేషన్ ప్రక్రియను రుద్దారు.దీని పలితంగా అన్ని సామాజిక రంగాలతో పాటు వ్యవసాయ రంగం కూడ సంక్షోబంలో పడింది.

Thursday, February 12, 2009

  • మార్కులు మా కక్కరలేదు.చిలుక పలుకులు,బట్టీలు పట్టడంమాకు చాతకాదు!సృజనాత్మకత మా పుట్టుకలోనే ఉంది.నా తండ్రి వ్యవసాయ పనిముట్లుతయారు చేయడంలో ఉంది.నా తల్లి పంట నూర్పిడిలో ఉంది.మీకు చేతనైతే ఒక అక్షరాన్నిఅందంగా చెక్కండి.వ్యాక్యాన్ని నల్లని దళితసౌందర్యవతిలా మార్చండి !కాలం మారిన కొద్దికులం రూపు మారిపోతుందనుకున్నానుకాని...ఉన్నత విశ్వ విద్యాలయాల్లోకాల నాగై కాటేస్తుందనుకోలేదు!మా ప్రతిభను కొలవడానికిమీకున్న ప్రస్తుత కొలమానాలు సరిపోవు.అనంతమైన నా తెలివినిమీ మోకాళ్ళతో కొలువలేరు!(విశ్వవిద్యాలయాల్లో కులవ్యవస్థ వికృత స్వరూపం చూసి...)